MLA Maheshwar Reddy: నిర్మల్, అక్టోబర్ 22 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అమలు కానీ హామీలను ఇచ్చి మోసం చేస్తోందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలం జాం గ్రామం నుంచి బోరింగ్ తండా వరకు రూ.3 కోట్ల 20లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.