Minister Ponnam Prabhakar
Minister Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar: శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట.. రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 46 సీసీ కెమెరాలు ప్రారంభం

Minister Ponnam Prabhakar: మనబలగం, సిరిసిల్ల ప్రతినిధి: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా పరిధిలో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 46 సీసీటీవీ కెమెరాలను శుక్రవారం వర్చువల్ ద్వారా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెళ్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలసి మంత్రి ప్రారంభించారు.
జిల్లాలో ప్రధాన రహదారులు ఆయన బోయినపల్లి నుండి జిల్లెళ్ల వరకు, రుద్రంగి నుండి వేములవాడ వరకు పైలెట్ ప్రాజెక్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో ఎల్లారెడ్డిపేట్ నుండి గంభీరావుపేట మండలం పెద్దమ్మ చెక్ పోస్ట్ వరకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణనే ద్యేయంగా పోలీసులు విధులు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో పటిష్ట శాంతిభద్రతల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వల్ల అనేక రంగాల్లో అభివృద్ధి గణనీయంగా జరుగుతుందని పేర్కొన్నారు.

జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్చంధంగా ముందుకు రావాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని చెప్పారు. నేరాల నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని మంత్రి ప్రభాకర్ వివరించారు. జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయడం జరిగిందని, కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చు అన్నారు. జిల్లాలో గ్రామాలలో పట్టణాలలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా, విజిబుల్ పోలీసింగ్, విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థ పకడ్బందీగా అమలు చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *