Good job: నిర్మల్, అక్టోబర్ 28 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌లో సోమవారం ఉదయం నుంచి ఓ ఆవు కాలుకు గాయమై కదలేని స్థితిలో ఉంది. స్థానికులు స్పందించి గో సంరక్షణ నిర్వాహకులకు సమాచారం అందించారు. నిర్వాహకులు వెంటనే స్పందించారు. వెంటర్నరీ వైద్యుడు గంగాధర్‌ను వెంటబెట్టుకొని ఆవు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. వెటర్నరీ వైద్యుడు ఆవు కాలుకు కట్టకట్టాడు. శ్రీనివాస్ వర్మ, శంకర్ సకాలంలో స్పందించి ఆవును రక్షించేందుకు కృషి చేసిన గో సంరక్షణ నిర్వాహకులను స్థానికులు అభినందించారు.