Tribute to Nirmal Rural CI, SI: నిర్మల్, నవంబర్ 3 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రానికి బదిలీపై వచ్చిన నిర్మల్ రూరల్ సీఐ, ఎస్ఐ రామకృష్ణ గౌడ్, లింబాద్రిలను గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువలు, పుష్ప గుచ్ఛాలతో సన్మానించారు. కార్యక్రమంలో గౌడజన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యులు పడాల రాజేందర్ గౌడ్, జిల్లా నాయకులు యాగండ్ల దశ గౌడ్, తీగెల శ్రీనివాస్ గౌడ్, పీసర శ్రీనివాస్ గౌడ్, కందునూరి అశ్విన్ గౌడ్, తీగెల భోజరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.