Minister Ponnam Prabhakar
Minister Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar: కరీంనగర్ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం

  • నేను, బండి సంజయ్ విద్యార్థి రాజకీయాల ఈ స్థాయికి వచ్చాం
  • మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్
  • కేంద్ర మంత్రితో కలిసి దాండియా వీక్షించిన రాష్ట్ర మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar: మనబలగం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా కలిసి పని చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ శుక్రవారం రాత్రి కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు పొన్నం ప్రభాకర్‌కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంజయ్‌తో కలిసి ఆలయ ఆవరణలో నిర్వహించిన దాండియా కార్యక్రమాలను తిలకించారు.

అంతకుముందు పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర మంత్రి, మా సొదరుడు బండి సంజయ్ నాయకత్వంలో మహాశక్తి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. విద్యార్ధి రాజకీయాల నుండి నేను, బండి సంజయ్ క్రియాశీలకంగా పనిచేస్తూ ఈరోజు నేను రాష్ట్ర మంత్రిగా, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎదిగాం. రాజకీయాలు వేరు. మేం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ లేకుండా కలిసి పనిచేస్తాం. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో శ్రమ పడి ప్రజల కోసం పనిచేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులతో కేంద్ర స్థాయిలో బండి సంజయ్, రాష్ట్ర స్థాయిలో నేను జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు క్రుషి చేస్తాం. అమ్మవారి దయతో ప్రజలకు మరిన్ని సేవలు చేస్తాం.’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *