Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

Bandi Sanjay: ఏం తల్లి చదువుకోవాలని ఉందా?

దొడ్డ మనస్సు చాటుకున్న బండి సంజయ్

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) మరో సారి తన దొడ్డ మనస్సును చాటుకున్నారు. చదువు మానేసిన బాలిక పరిస్థితి చూసి చలించి పోయారు. వెంటనే బాలిక ఉన్నత చదువులకు కావాల్సిన చర్యలకు ఆదేశించారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చర్లపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. తిరిగి వెళుతుండగా గ్రామ శివారులో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైనే భోజనాలను చేయడాన్ని గమనించి అక్కడికి చేరుకున్నారు. ఆ కూలీల్లో మైనర్ బాలికను చూసి ‘ఏం తల్లి పనికి వెళుతున్నవ్. చదువు ఇష్టం లేదా?’ అని ప్రశ్నించాడు. కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బోళ్ల అక్షయ అని, టెన్త్ క్లాస్ పాసైనప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక కూలీ పనులకు వెళుతున్నానని చెప్పింది. తనకు చదువుకోవాలని ఉందని తెలిపింది. వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డిని పిలిచి బాలిక వివరాలు తీసుకుని వెంటనే కాలేజీలో చదివించడంతోపాటు ఆసక్తి ఉంటే హాస్టల్‌లో చేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అక్షయ బండి సంజయ్‌కు ధన్యవాదాలు చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *