Allu Arjun: పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ ఇంకా దీనిపై ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. కథలు వినిపించారంటూ సందీప్‌రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్.. ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఒకవైపు అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తూనే, మరోవైపు ఆ తర్వాత సినిమా కోసం కథా చర్చలు కొనసాగిస్తున్నట్టు ప్రచారం కొనసాగుతోంది. పుష్ప 2 తర్వాత అందుకు దీటైన కథల్నే ఎంచుకునే ప్రయత్నాల్లో అల్లు అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మరో దర్శకుడు కలిసి కథ వినిపించినట్లు సమాచారం. ఆయనే జైలర్ ఫేమ్ నెల్సన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా అనే గుస గుసలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 తరువాత క్లారిటీ వచ్చే అవకాశముంది. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సైతం బన్నీ కోసం పురాణాలతో ముడిపడిన ఓ కథని సిద్ధం చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మరి అల్లు అర్జున్ ఎవరి కథతో సినిమా తీస్తారో అనేది ఆసక్తిగా మారింది.