- సూపర్ -8లో సెకండ్ విక్టరీతో బెర్త్ ఖాయం
- బంగ్లాపై 50 పరుగుల తేడాతో విన్
T20 World Cup 2024, IND vs BAN: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ దూకుడు కొనసాగిస్తోంది. సూపర్ -8 నుంచి సెమీస్‌కు బెర్త్‌ను ఖరారు చేసుకున్నది. రోహిత్ సేన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయాన్ని అందుకున్నది. సూపర్ 8 గ్రూప్-1లో వీవీయన్ రిచర్డ్స్ స్టేడియంలో బంగ్లాదేశ్, ఇండియా తలపడ్డాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకున్నది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివర్లో హార్దిక్ పాండ్యా వీర విహారం చేయడంతో పరుగుల వరద పారింది. రోహిత్ 23, కొహ్లీ 37, పంత్ 36, సూర్య 6, శివమ్ దూబే 34, హార్దిక్ 50, అక్షర్ 3 పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. లిటన్ దాస్ 13, హసన్ 29, షాంటో 40, హ్రిదోడ్ 4, హసన్ 11, మహ్మదుల్లా 13, జకీర్ అలీ 1, రషీద్ హుస్సేన్ 24, హసన్ 5, షకీబ్ 1 పరుగులు చేశారు. కుల్దీప్ 3, బుమ్రా 2, అర్షదీప్ 2 వికెట్లు తీశారు. దీంతో భారత్ 50 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.