Abul Kalam Azad Jayanti: నిర్మల్, నవంబర్ 10 (మన బలగం): స్వాతంత్ర్య సమరయోధులు మత, సమైక్యవాది, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి ఉత్సవాలను కలాం గుణం ఎడ్యుకేషనల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక క్లాక్ టావర్ ముందర మౌలానా ఆజాద్ చౌక్‌లో నిర్వహిస్తున్నట్లు సొసైటీ వ్యవస్థాపక, అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. ఈ నెల 11న సోమవారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.