Purchase center inspection: ఇబ్రహీంపట్నం, నవంబర్ 18 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఇబ్రహీంపట్నం మండల ఎఫ్పీవో చైర్మన్ మెర్తాడి గంగారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతం పరిశీలించి మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదగడంతోపాటు, వారు పండించిన పంటను వారే నేరుగా విక్రయించుకునేందుకు ఏర్పాటైన రైతు ఉత్పతుల (ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం విక్రయాలు చేసుకొని ఏ గ్రేడ్ ధర 2320, బీ గ్రేడ్ ధర 2300 క్వింటాలుకు పోందాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్పీవో సీఈవో శ్రీధర్, ఎఫ్పీవో సభ్యులు బోరిగాం మహేశ్, రాగుల గణేశ్, శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.