Women Power Canteens
Women Power Canteens

Women Power Canteens: మహిళా శక్తి క్యాంటీన్లతో సాధికారత.. జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

Women Power Canteens: నిర్మల్, నవంబర్ 25 (మన బలగం) : మహిళా శక్తి క్యాంటీన్లు మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. సోమవారం పట్టణంలోని వైద్య కళాశాలలో మహిళా శక్తి క్యాంటీన్ ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా స్వయం సంఘాలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఆర్థికంగా బలపడడానికి తోడ్పడతాయన్నారు. ఈ మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా వైద్య విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. అనంతరం వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో మాట్లాడుతూ, కళాశాలలో ఏర్పాటుచేసిన మహిళా శక్తి క్యాంటీన్ వినియోగించుకొని మహిళా సాధికారితకు చేయూతనివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *