tattoos
tattoos

tattoos: పచ్చబొట్టు చెరిగి పోదులే.. టాటూస్ పట్ల యువత మక్కువ

  • ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచిన వర్మ టాటూస్
  • బ్లడ్ పెయింటింగ్‌లో ప్రత్యేకత
  • నిర్మల్‌కే గుర్తింపు తెస్తున్న వర్మ టాటూస్
  • మంత్రి సీతక్కకు బ్లడ్ పెయింటింగ్ ఫొటో బహూకరణ

tattoos: నిర్మల్, జనవరి7 (మన బలగం): పచ్చబొట్టు చెదిరి పోదులే నా రాజా అంటూ అలనాడు ఉర్రూతలూగించిన సినిమా పాటకు నేటి యువత ఫిదా అవుతున్నారు. చేతులపై, మెడపై, ఛాతిపై టాటూస్ వేయించుకునేందుకు యువత మక్కువ చూపుతున్నారు. ఒంటిపై టాటూస్ వేయించుకొని ప్రత్యేకంగా ఉండేందుకు యువత శ్రద్ధ కనబరుస్తున్నారు.

టాటూస్‌పై యువత మక్కువ
ఒంటిపై టాటూస్ వేయించుకునేందుకు యువత మక్కువ చూపుతున్నారు. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే వయోభేదం లేకుండా నేడు టాటూస్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అందరిలో ఒక్కరు కాకుండా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండే విధంగా ఎవరికి వారు తమ ప్రయత్నాలను చేస్తున్నారు. ఒంటిపై బొమ్మలు, పేర్లు, తమ పేర్లకు ముందు వచ్చే అక్షరాలు, అభిమానించే వ్యక్తుల పేర్లను, ఫొటోలను ఒంటిపై వేయించుకుంటున్నారు. గతంలో మాదిరి కాకుండా అధునాతన పద్ధతుల్లో టాటూస్ను వేస్తున్నారు.

నిర్మల్ ఉత్సవాల్లో వర్మ టాటూస్
నిర్మల్‌లో మూడు రోజులుగా సాగుతున్న నిర్మల్ ఉత్సవాలలో వర్మ టాటూస్ ప్రత్యేకంగా నిలిచింది. దేవుళ్ల బొమ్మలు, పేర్లతో పటు మనుషుల ఫొటోలను టాటూస్ వేయడం వల్ల వర్మ టాటూస్ నిర్మల్ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిలిచింది. జిల్లా అధికారులతో పాటు నాయకులు సంతోష్ వర్మ పనితీరును అభినందించారు.

బ్లడ్ పెయింటింగ్ ప్రత్యేకం
సంతోష్ వర్మ టాటూస్‌లోనే కాకుండా బ్లడ్ పెయింటింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొంది ఉన్నారు. ప్రముఖుల చిత్రాలను బ్లడ్ పెయింటింగ్స్‌తో వేసి వారికి అందజేసి మన్ననలను పొందారు. నిర్మల్ ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన సీతక్క ఫొటోను బ్లడ్‌తో పెయింటింగ్ చేసి బహుకరించి మంత్రి సీతక్క మన్ననలను పొందారు. సంతోష్ వర్మ వేసిన బ్లడ్ పెయింటింగ్ చిత్రాన్ని చూసి మంత్రి సీతక్క మురిసిపోయారు.

నిర్మల్‌కే వన్నె తెస్తున్న వర్మ టాటూస్
నిర్మల్ పట్టణంలో ఆరేళ్ల క్రితం ఏర్పాటుచేసిన వర్మ టాటూస్ ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రముఖ నగరాలకు దీటుగా టాటూస్ వేయడంలో సంతోష్ వర్మ ప్రత్యేక శిక్షణ పొంది ఉన్నారు. ఒంటిపై పేర్లు, అక్షరాలు, దేవుళ్ళ చిత్రాల తోపాటు మనుషుల ఫొటోలను కూడా అచ్చు గుద్దినట్లు వేస్తున్నారు. దీంతో అనతి కాలంలోనే వర్మ టాటూస్ ప్రత్యేక గుర్తింపును పొందింది. టాటూస్ అనగానే సంతోష్ వర్మ గుర్తుకు వచ్చే విధంగా వేస్తున్నారు. యువతకు నచ్చే విధంగా వారు మెచ్చే విధంగా టాటూస్ వేయడంలో సంతోష్ వర్మ దిట్ట. దీంతో సంతోష్ వర్మ టాటూస్ నిర్మల్‌కే వన్నె తెస్తున్నాయి.

tattoos
tattoos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *