Bumrah: జస్ ప్రీత్ బుమ్రా టీం ఇండియా పేస్ దళపతి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. మిగతా అందరి బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తున్న బ్యాటర్లు.. బుమ్రా బౌలింగ్‌ను మాత్రం ఆచి తూచి ఆడుతున్నారు. బుమ్రా రన్స్ ఇచ్చేందుకు అస్సలు ఇష్టపడటం లేదు.
బుమ్రా తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా షేర్ చేసుకోడు. కానీ ఈ రోజు తన భార్య సంజన గురించి ఎమోషనల్ పోస్టు చేశాడు. స్పోర్ట్ యాంకర్ సంజన గణేశన్‌తో ప్రేమ వ్యవహారం తర్వాత వీరు 2021లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. బుమ్రా గాయపడి టీం ఇండియాకు చాలా రోజులు దూరమయ్యాడు. వీరిద్దరికి 2023లో ఒక సంతానం కలిగింది. అయితే బుమ్రా భార్య సంజన గణేశన్ బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్టు ను బుమ్రా ట్వీట్ చేశాడు.. నీవు లేనపుడు నా జీవితం సగం.. నీవు నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత పరిపూర్ణంగా మారింది. అలాంటి నా ప్రియమైన భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నిజంగా ఈ రోజు ఎంతో స్పెషల్ అని పోస్టు చేశాడు. భార్యపై ఎంత ప్రేమ ఉందో బుమ్రా అందరికీ తెలిసేలా చేశాడు. సంజన గణేశన్ కూడా స్పోర్ట్ యాంకర్ కావడం.. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడం రెండు సంవత్సరాల పాటు చెట్టపట్టాలేసుకుని తిరిగి చివరకు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.
బుమ్రా ప్రస్తుతం ముంబయి బౌలింగ్ కు వెన్నెముకలా ఉన్నాడు. కానీ మిగతా బౌలర్లు రాణించడం లేదు. దీనికి తోడు బ్యాటర్లు కూడా ఫామ్ కోల్పోయి ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ముంబయి ఇండియన్స్ పాయింట్స్ టేబుల్స్ లో లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా మూడు మ్యాచులు మిగిలి ఉన్న సమయంలో మిగతా మూడు మ్యాచులు గెలిచి ఎలాగైన పరువు నిలుపుకోవాలని చూస్తుంది. ఈ రోజు ముంబయి లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరగనున్న మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.