Free Live on Hot Star, T20 World Cup: ఐసీసీ మెగా టోర్నీలకు సంబంధించి హక్కులు మొత్తం డీస్నీ హాట్ స్టార్ చేతిలో ఉండడంతో డిజిటల్ ప్లాట్ ఫాంలో ఫ్రీగా చూడొచ్చని అనౌన్స్‌మెంట్ చేసింది. గతంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇలాంటి అవకాశం కల్పించకపోగా.. జియో తన వ్యూవర్ షిప్‌ను పెంచుకునేందుకు ఇలా సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తుంది.
క్రికెట్‌ను ఎంతో ఆదరించే అభిమానుల కోసం ఈ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్లు చెప్పింది. కానీ టీవీల్లో చూసేవారు మాత్రం ఎప్పటిలాగే డబ్బులు చెల్లించాల్సిందే. గతంలో ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్, అండ్ ఆసియా కప్‌లను డిస్నీ హాట్ స్టార్ ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ కూడా చూసే అవకాశం కల్పించడంతో మొబైల్ ఫొన్లలో లైవ్ స్ట్రీమింగ్‌ను ఫ్రీగా చూడొచ్చు.
జూన్ 2వ తేదీ నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. జూన్ 29న ముగుస్తాయి. దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పండగే పండుగ. ఈ సిరీస్‌కు వెస్టిండీస్, అమెరికా రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
ఈ మెగా టోర్నీలో 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి మెగా టోర్నీలో 20 దేశాలు ఎప్పుడు పాల్గొనలేదు. చివరగా 14 దేశాలతోనే ఐసీసీ వరల్డ్ కప్ నిర్వహించింది. కానీ ఈ టోర్నీ ద్వారా ఐసీసీ క్రికెట్‌ను అమెరికాతో పాటు విశ్వవ్యాప్తం చేయాలని నిర్ణయించుకుంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి అర్హత పోటీలను పెట్టింది. ఇందులో విజయం సాధించిన వారికి మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. మొదటి 10 టీమ్‌లు నేరుగా టోర్నీకి అర్హత సాధించగా.. మిగతా టీంలు అర్హత మ్యాచుల్లో గెలిచి తమ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి.