Mumbai Quit IPL 2024: అయిదు సార్లు ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ ఛాంపియన్. కానీ ఈ సీజన్‌లో అనవసర ప్రయోగాలు చేసి ఓటములను కొని తెచ్చుకుంది. ముంబయి ఇండియన్స్ యాజమాన్యం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను కాదని గుజరాత్‌కు కెప్టెన్‌గా చేస్తున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. రైటు టు మనీ విధానంలో హర్దిక్‌ను కొని తెచ్చుకుంది.
అయిదు సార్లు ముంబయి ఇండియన్స్‌కు కప్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన బెట్టడంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. దీనికి తోడు హార్దిక్ ఏ మాత్రం రాణించకపోవడంతో మరింత నెగిటివ్ ప్రచారం పెరిగింది. ఏ సీజన్‌లో అయినా కనీసం ప్లే ఆఫ్ దాకా వెళ్లడం ముంబయికి అలవాటు.. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్న ఈ టీంలో సమష్టి లోపంతో పాయింట్స్ టేబుల్స్‌లో అట్టడుగు స్థాయిలో నిలిచింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడి కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. మిగతా 8 మ్యాచుల్లో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. రెండు గెలిచినా 12 పాయింట్లు మాత్రమే వస్తాయి. నెక్ట్స్ ఢిల్లీ, వర్సెస్ లక్నో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా ఆ టీంకు 14 పాయింట్లు వస్తాయి. దీంతో ఇప్పటికే పాయింట్స్ టేబుల్స్‌లో 16 పాయింట్లతో కోల్‌కతా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. రాజస్థాన్ కూడా 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మూడో స్థానంలో 14 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండగా.. ఢిల్లీ, లక్నోలో ఎవరూ గెలిచినా 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంటుంది. దీంతో 12 పాయింట్లు ఉన్న జట్లు ఏవీ టాప్ ఫోర్‌లోకి అర్హత సాధించలేవు. కాబట్టి ముంబయి ఇండియన్స్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా… రెండు గెలిచినా వాటితో కేవలం 12 పాయింట్ల వరకు మాత్రమే చేరుకుంటుంది. దీంతో అఫీషియల్‌గా ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంటి దారి పట్టిన మొదటి టీంగా అప్రతిష్ట మూట గట్టుకుంది.