Thota Indira retirement felicitation Khanapur Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన తోట ఇందిరా 35 సంవత్సరాలపాటు ఆరోగ్యశాఖలో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ పాల్గొని మాట్లాడారు. పదవీ విరమణ పొందినా ప్రజాసేవను మాత్రం ఇందిరా ఎప్పటికీ విడువలేదని, ప్రజల ఆరోగ్య సంరక్షణలో తన సేవలు మరచిపోలేనివని అన్నారు. తన కృషి, అంకితభావం కొత్త తరాలకు స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా జనని ఫౌండేషన్ చైర్మన్ తోట సుమిత్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీ సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహచరులు, బంధుమిత్రులు, నాయకులు, అధికారులు మొదలగు వారు పాల్గొని తోట ఇందిరా సేవలను ప్రశంసించారు.
