Divyanagar Durga Mata Kumkuma Puja Annadanam Dandiya Nirmal
Divyanagar Durga Mata Kumkuma Puja Annadanam Dandiya Nirmal

Divyanagar Durga Mata Kumkuma Puja Annadanam Dandiya Nirmal: దివ్యనగర్ దుర్గామాత వద్ద ఘనంగా కుంకుమ పూజ

భారీ ఎత్తున అన్నదానం.. ఆకట్టుకున్న దాండియా
Divyanagar Durga Mata Kumkuma Puja Annadanam Dandiya Nirmal: పిల్లాపాపలతో చల్లంగా చూడు తల్లి.. అందరిని ఆదుకునే అమ్మవు నీవే అంటూ ఘనంగా పూజలు చేశారు. నిర్మల్ పట్టణంలోని దివ్య నగర్ కాలనీ దుర్గామాత చెంత శుక్రవారం వైభవోపేతంగా కుంకుమ పూజను నిర్వహించారు. సదాశివశర్మ నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమానికి కాలనీ మహిళలతో పాటు పట్టణంలోని పలు కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున పూజా సామగ్రి అందజేశారు. పూజా కార్యక్రమానికి హాజరైన మహిళలకు, కాలనీవాసులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలనీకి చెందిన ముక్క మాధురి రాజేశ్వర్ అన్నదానం చేయగా ముసుకు హేమ సతీష్ రెడ్డిలు అల్పాహార దాతలుగా నిలిచారు. ఏపీడీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా, కోలాటం, దాండియా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *