Thanu Nayak Vardhanti: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 20 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కామ్రేడ్ ఠను నాయక్ 75వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం లైవ్ రాష్ట్ర ఇన్‌చార్జి నరేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రైతంగా పోరాట యోధుడు ఠను నాయక్ అని తెలిపారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. దున్నే వాడిదే భూమి అనే నినాదంతో బ్రిటిషర్స్, దేశ్‌ముఖ్‌లతో పోరాడి ప్రాణాలు అర్పించారని తెలిపారు. ప్రభుత్వం గుర్తించి ట్యాంక్ బండ్‌పై ఠను నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజేష్ నాయక్, జిల్లా నాయకులు నరహరి నాయక్, తిరుపతి, సాగర్, వెంకటేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.