Jagityala SP Ashok Kumar: జగిత్యాల, డిసెంబర్ 1 (మన బలగం): జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్ట్యా నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుంచి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించేలా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. జిల్లాలోని ప్రజలు పోలీసులకు ఈ విషయంలో సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎస్పీ కోరారు.