Mobiles Recovery: ధర్మపురి, అక్టోబర్ 7 (మన బలగం): జగిత్యాల జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 104 మొబైల్ ఫోన్లను (సుమారు రూ.20 లక్షల విలువ) సోమవారం పోలీసులు బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బాధితులకు సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ పోతే ఆందోళన చెందవద్దని, CEIR ద్వారా తిరిగి పొందవచ్చని వెల్లడించారు.