Admissions in Navodaya: నిజాంసాగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి డీఈవో రాజు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ ఆఖరు అని తెలిపారు. దరఖాస్తు, పరీక్ష తేదీ తదితర వివరాలు www.navodaya.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.