Bhumi Puja for building the pyramid: ధర్మారం, అక్టోబర్ 13 (మన బలగం): పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పిరమిడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుంటి తిరుపతి మాట్లాడుతూ.. ధర్మారం మండల కేంద్రంలో ఐదో పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బుద్ధుడు చెప్పిన ఆనా పానా సతి- శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయాలని కోరారు. కార్యక్రమంలో చొప్పదండి సీనియర్ మాస్టర్ రవికుమార్, ధర్మారం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దిల్లేశ్వర్ రెడ్డి, రమేశ్ మాస్టర్, మాధవ మాస్టర్, రాజమౌళి సేటు, మామిడి శెట్టి శ్రీనివాస్, తాళ్లపల్లి సురేందర్ గౌడ్, మల్లేశం, గుంత భాస్కర్, మల్యాల శ్రీనివాస్, రాము, వంశీకృష్ణ, కిషోర్, అంజయ్య, ప్రసాద్, మండల కేంద్రంలోని ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.