MLA Dr. Kalvakuntla Sanjay
MLA Dr. Kalvakuntla Sanjay

MLA Dr. Kalvakuntla Sanjay: కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసింది ఏమీలేదు : ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

MLA Dr. Kalvakuntla Sanjay: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3 (మన బలగం): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిపాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో విఫలమైందని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం ముగిసి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటారని అందుబాటులో ఉండే సేవలు అందిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఇచ్చి వాటిని అమలు పరచడంలో విఫలమైందని కళ్యాణ లక్ష్మి లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని బంగారం మాట ఏమైంది అన్నారు. అంతకుముందు కాసోజి శ్రీకాంతాచారి తెలంగాణ ఏర్పాటు కోసం అమరుడు కాగా ఆయన వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాలు నివాళులర్పించారు. అంతకుముందు వర్ష కొండ గ్రామంలో ఐలవలు వంతెనకు అడ్డుగా ఉన్న పైపులైన్ తొలగించేందుకు ఎంపీ సురేశ్ రెడ్డి నిధులు రూపాయలు 3 లక్షలతో చేసే పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *