Former Minister Koppula Ishwar: ధర్మపురి, డిసెంబర్ 13 (మన బలగం): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు కల్పిస్తున్న రూ.2 లక్షల బీమా సౌకర్యం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోవిందుపల్లె గ్రామ బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు కోల శంకరయ్య ఈ సంవత్సరం జూలై 27న, బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తొవిటి రవి ఆగస్టు 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా కల్పించిన బీమా సౌకర్యం కలిగి ఉండడంతో రూ.2 లక్షల చొప్పున బీమా మంజూరైంది. మంజూరైన చెక్కులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో రవి భార్య లక్ష్మీ, కోలా శంకరయ్య భార్య మమతకు అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు కొండత భరోసా ఇస్తోందన్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.