Maheshwar Reddy: భారీ వర్షాల కారణంగా ఎవరు అధైర్యపడవద్దని అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని,
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం జిల్లాలోని సోన్ మండలం జాఫ్రాపూర్ బ్రిడ్జితోపాటు, పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. వర్షాలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, అధికారులు ఉన్నారు.