ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
Food poisoning: నిర్మల్, నవంబర్ 4 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్ కాలనీలోని గ్రిల్ నైన్ హోటల్లో ఆదివారం భోజనం చేసిన పలువురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైనవారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. 13 మంది అస్వస్థతకు గురికాగా ఇందులో ఏడుగురు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కాగా బాధితులంతా ఇచ్చోడ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రజలకు కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.