Bonalu: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ ఆలయం ఏర్పాటు చేయగా నాలుగు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధులగుండా బోనాల ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, బైండ్లోళ్ల విన్యసాల మధ్య ఊరేగింపు సాగింది. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ పెద్దలు సున్నం రమేశ్, రెడ్డవేన లక్ష్మీ నర్సయ్య, పల్లి శ్రీనివాస్, రెడ్డవేన రాజేశ్ పాల్గొన్నారు.
పెద్దమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం
వేములకుర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ ఆలయ అభివృద్ధికి మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ దంపతులు రాణవేణా సుజాత-సత్యనారాయణ దంపతులు రూ.50 వేలు విరళం అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సదర్భంగా సత్యనారాయణను ఘనంగా శాలువాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు పెంట లింబాద్రి, రెడ్డవేన అజయ్, సున్నం రమేశ్, సున్నం రాజేశ్, సురేశ్, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.