Installation of the idol of Lord Krishna: నిర్మల్, నవంబర్ 9 (మన బలగం): నిర్మల్ పట్టణంలో శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్ర యాగంలో భాగంగా శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. 15రోజుల పాటు సాగే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు శ్రీకృష్ణుడి ఉత్సవ మూర్తి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. స్థానిక చైన్ గేట్ హనుమాన్ ఆలయం నుంచి యాగశాల వరకు కొనసాగింది. రాత్రి 10 గంటలకు శోభాయాత్ర యాగశాలకు చేరకొంది. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని యాగశాలలో ప్రతిష్టించే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ యాగం విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ప్రవచనాలు వినిపించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా భక్తులు భజనలు, కోలాటాలు నిర్వహించారు. కార్యక్రమాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏడు గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సూర్య సుదర్శన హోమములు, సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.