Dharmapuri: ధర్మపురి, నవంబర్ 15 (మన బలగం): జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కార్తీక పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శివకేశవులకు అత్యధిక ప్రీతికరమైన కార్తీక మాసం పంచ పర్వాలలో కార్తీకమాసం ప్రత్యేకతను పురస్కరించుకొని భక్తులు క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు క్షేత్రానికి భారీగా తరలించారు. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పవిత్ర పుణ్యస్నానం ఆచరించిచారు. కార్తీకదీపం వెలిగించి గోదావరి నదిలో వదిలారు. కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం, దీపాదారం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. నంతరం నరసింహుని మందిరానికి తరలివెళ్లారు. మొదటగా ఆలయ ఆవరణలో గల ఉసిరిక చెట్టు వద్ద భక్తులు ప్రదక్షినలు చేసి కార్తీక దామోదరుడికి ప్రత్యేక పూజలు జరిపి దీపాలను వెలిగించారు. తమ కుటుంబాలను కాపాడాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.