New Polling Stations: నిర్మల్, అక్టోబర్ 16(మన బలగం): పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ లో భాగంగా బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖానాపూర్ నియోజకవర్గం లోని పెంబి మండలంలో కొత్తగా 3 పోలింగ్ స్టేషన్ ల కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. అందులోభాగంగా రాంనగర్ మండల పరిషత్ పాఠశాల, బూరుగుపల్లి మండల పరిషత్ పాఠశాల, వాస్పల్లి మండల పరిషత్ పాఠశాలలు ఉన్నాయన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, బి జె పి జిల్లా కార్యదర్శి కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాజుల రవి కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సయ్యద్ హైదర్,వై ఎస్ ఆర్ సి పి పార్టీ నాయకులు నరేష్ పాల్గొన్నారు.