RDO inspected the purchase center: ఇబ్రహీంపట్నం, నవంబర్ 23 (మన బలగం): ట్రక్ షీట్ డేటా ఎంట్రీ చేసి రైతులకు డబ్బులు ఇప్పించాలని, కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సందర్భంగా శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని రోజువారీగా పరిశీలించి తూకం వేయాలని, తూకం వేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు సంబంధిత మిల్లులకు పంపాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. డబ్బులను అకౌంట్‌లో వేయాలని సూచించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ ప్రసాద్, కొనుగోలు కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.