Farmers protest: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్శకొండ గ్రామానికి చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. క్రాప్‌లోన్ రెండు లక్షల రూపాయలపై చిలుకు ఉన్నందున మాఫీ కాలేదని, ఒకే ఇంట్లో భార్యకు 90 వేలు భర్తకు 1.30 వేలు ఉన్నా రుణం మాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా రుణమాఫీ అయ్యేలా చూడాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.