Sharannavaratras: నిర్మల్, అక్టోబర్ 3 (మన బలగం): శరన్నవరాత్రులు గురువారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. అమ్మవారి ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మంటపాలలో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయదశమి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని గండి రామన్న దుర్గామాత ఆలయం, మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలోని లలితాదేవి సన్నిధిలో భారీ ఎత్తున మాలధారణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయాల్లో అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు.