Ellampalli project: ఎల్లంపల్లి ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సంధర్బంగా ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని విడుదల చేయడం ద్వారా ఎల్లంపెల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడం జరుగుతుందని, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు మరియు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. గోదావరిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పుడు ఇక్కడే ఉంటూ పై నుంచి ఎంత ఇన్ ఫ్లో వచ్చినా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గేట్లు ఎత్తి పర్యవేక్షణ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.