Froding: ధర్మపురి, అక్టోబర్ 1 (మన బలగం): ధర్మపురి నియోజకవర్గం వ్యాప్తంగా నిరుపేదలైన మహిళల జీవితంలో పొదుపు ఆర్థిక ఎదుగుదలను పెంపొందించడం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం డాక్రా మహిళా సంఘాల వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చింది. అయితే మహిళల్లో పొదుపు మహిళా సంఘాల ఏర్పాటు చేయడం బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలకు లోన్లు ఇప్పించడం. శ్రీనిధి ద్వారా కుటుంబాల జీవనోపాధులకు ఆర్థిక సాయం చేయడం. ఇలా మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసే దిశగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా కొంతమంది మహిళలను కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. అలా ధర్మపురి నియోజకవర్గం గ్రామాల్లో ఏర్పాటైన గ్రామైక్య సంఘాలుగా ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించి కొన్ని గ్రూపులను కలుపుకొని ఆ గ్రూపులపై ఆ గ్రామానికి చెందిన సీఏలను ఏర్పాటు చేశారు. సీఏల ఆధ్వర్యంలో ఖాతా బుక్కుల తీర్మానాలు రాసి సంఘాలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సీఏలపై ఉంటుంది. సక్రమ మార్గంలో నడిపించాల్సిన నిర్వాహకులు కొందరు సీఏలు అక్రమ మార్గంలో వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి?