పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
MLA Sanjay Kumar: జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో 14 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకును నిర్మిస్తున్నారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పనులను పరిశీలించారు. నూకపల్లి సరస్వతి గుట్ట పైన డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల కోసం రూ.14 కోట్లతో 14 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు నివాస సదుపాయం కల్పించడానికి నూకపల్లిలో 4500 ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
తాగునిటి అవసరాల కోసం సరస్వతి గుడికి సమీపంలో 14 లక్షల లీటర్ల స్టోరేజ్‌తో వాటర్ ట్యాంకు పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, డి.ఈ జలంధర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, తదితరులు ఉన్నారు.