బీసీ సంఘ నాయకులు డాక్టర్ కృష్ణం రాజు
BC Caste Intellectuals Conference: నిర్మల్, నవంబర్ 2 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక మంజులపూర్ హోటల్ మారుతి ఇన్‌లో డీసీసీ అధ్యక్షుడు కుచాడీ శ్రీహరి రావు ఆధ్వర్యంలో భైంసా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఆనంద్ రావు పటేల్ అధ్యక్షతన బీసీ కులాల మేధావుల సదస్సు శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ మేధావులు, ప్రతినిధులు, బీసీల్లోని అన్ని కులాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై తమ వాణిని వినిపించారు.
ఇచ్చిన మాట ప్రకారం కులగణన: నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్
కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీల కులగణన చేపట్టడం, బీసీలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు.
కులగణనకు సహకరించాలి: భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్
నవంబర్ 6 నుంచి జరగబోయే బీసీ కులగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తప్పులు లేకుండా ప్రజలు తమ తమ కులాల వివరాలు తెలియజేయాలని, బీసీ కులాల సర్వే ఆధారంగా బీసీల్లోని అన్ని కులాలకు న్యాయం చేయడం సులువు అవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: డాక్టర్ కృష్ణంరాజు
బీసీల కులగణన చేపడుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మొన్న ప్రకటించిన 37 కార్పొరేషన్‌లలో అధిక సంఖ్యలో బీసీలకు స్థానం కల్పించడం హర్షణీయమన్నారు. కుల సంఘాల ఫెడరేషన్‌లు ఏర్పాటు చేస్తున్నందుకు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే అని అన్నారు. ఇంకా పలువురు వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ గానీ ఏ ప్రభుత్వం చేయని ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి కులగణన చేపట్టడం తెలంగాణ చరిత్రలో లిఖింపబడుతుందని అన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సోమా భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్నూ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, మైనార్టీ నాయకులు హాజర్, అయ్యన్న గారి పోశెట్టి, గాజుల రవి కుమార్, కొట్టే శేఖర్, డాక్టర్ ఈసవేని మనోజ్ యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మాజీ నిర్మల్ ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్, భైంసా ఏఎంసీ వైస్ చైర్మన్ ఫారూఖ్, ఎంబడి రాజేశ్వర్, మహిళా అధ్యక్షురాలు గంగా భవాని, వివిధ కుల సంఘాల నాయకులు, మేధావులు, బీసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.