chiranjeevi: వయనాడ్లో ప్రకృతి విపత్తు సంభవించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రాణాలతో బయటపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటి వరక 400 మందికిపైగా మరణించారు. ఇంకా 150 మంది వరకు గల్లంతయ్యారు. ఒక వైపు బధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు గల్లంతైన వారికోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధితులను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, ప్రముఖులు, సినీ రంగాల వారు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. తాజాగా ఆయన శుక్రవారం కేరళ సీఎం పినరాయి విజయన్ను కలిసి రూ.కోటి చెక్కు అందజేశారు. కాగా ప్రకృతి విపత్తు సంభవించిన ప్రాంతాల్లో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.