ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు
The reporter waits for help: నిర్మల్, మన బలగం: నిర్మల్ జిల్లా సారంగాపూర్ ప్రజాపక్షం రిపోర్టర్ రామచంద్ర గౌడ్ విధి నిర్వహణలో భాగంగా సారంగాపూర్‌లో న్యూస్ కవరేజ్‌కి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే తక్షణ ఆపరేషన్ అవసరం. ఇందుకోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. రామచంద్ర గౌడ్ పేద కుటుంబానికి చెందినవాడు కావడం వల్ల ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం వారికి కష్టంగా మారింది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవతావాదులు, దాతలు ఆర్థిక సహాయాన్ని అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వారికి తోచినంత సాయం అందించి, గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ 8885013554కు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.