Check out the rice mills
Check out the rice mills

Check out the rice mills: రైస్ మిల్లులు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

Check out the rice mills: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా శనివారం పలు రైస్ మిల్లులు తనిఖీ చేశారు. యాసంగి (రబీ) 2022-23 సీజన్ కి చెందిన వేలం వేసిన ధాన్యాన్ని గంభీరావుపేట మండలంలోని శ్రీ వేంకటేశ్వర ఇండస్ట్రీస్ (లింగన్నపేట), లక్ష్మి నారాయణ ఇండస్ట్రీస్ (లింగన్నపేట), వాయుపుత్ర రైస్ మిల్ (కొత్తపల్లి) మిల్లులను తనిఖీ చేశారు. ఈ విషయంపై మిల్లర్లకు వారి వద్ద ఉన్న యాసంగి ధాన్యం గుత్తేదారులకు ఈ నెల 31వ తేదీలోగా అందజేయాలని, లేని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పి. వసంత లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లయ్) నవీన్ కుమార్, మండల తహసీల్దార్ భూపతి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *