Women's Day
Women's Day

Women’s Day: 250 మంది మహిళలకు సన్మానం.. ప్రశంసా పత్రాలు ప్రదానం

Women’s Day: కరీంనగర్, మార్చి 10 (మన బలగం): సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని కరీంనగర్ కళాభారతిలో సోమవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని సర్వాయి పాపన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు తాళ్ల పెళ్లి సంధ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వాయి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు కోడూరు పరుశురాములు గౌడ్, సర్వాయి పాపన్న రాష్ట్ర మాజీ అధ్యక్షులు కలర్ సత్తన్న గౌడ్, సర్వాయి పాపన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర నాయకులు సింగం సత్తన్న గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, కర్భుజ తిరుపతి గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, సర్వాయి పాపన్న జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర పరుశ రాములు గౌడ్, సర్వాయి పాపన్న జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్, సర్వాయి పాపన్న చిగురు మామిడి మండల అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం, ముంజ శ్రీనివాస్ గౌడ్ మరియు గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 250 మంది మహిళా కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *