Minister Duddilla: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం కడెం ప్రాజెక్ట్ పర్యవేక్షణకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు గంజాల్ టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పలువురు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.