Aadi's Shanmukha ready to release
Aadi's Shanmukha ready to release

Aadi’s Shanmukha ready to release: ఆది సాయికుమార్ విజువల్ వండర్ షణ్ముఖ విడుదలకు సిద్ధం

Aadi’s Shanmukha ready to release: విభిన్న కథాంశంతో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి సాప్పని దర్శకత్వం వహిస్తున్నారు. ‘శాసనసభ’ అనే పాన్ ఇండియా చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్న సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా షణ్ముఖను నిర్మిస్తోంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్మగం సాప్పని, రమేశ్ యాదవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో సినిమాను నిర్మించినట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం కోసం గ్రాండ్‌గా వేసిన సెట్‌లో చివరి షెడ్యూల్ పూర్తయ్యిందని చెప్పారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బసూర్ ఈ మూవీకి స్టన్నింగ్ మ్యూజిక్ అందించారని సంతోషంగా తెలిపారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో నిర్మాణానంతర పనులు మొదలు పెడుతున్నట్లు చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించామని వెల్లడించారు. ఓ వండర్ ఫుల్ మూవీని ప్రేక్షకులకు అందించాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. ఈ సినిమా ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *