murder: నిర్మల్, జనవరి 18 (మన బలగం): నిర్మల్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర సంఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలుడి ప్రైవేటు పార్ట్స్‌పై దాడి చేసి అతి దారుణంగా హత్య చేసారు. ఈ సంఘటన చిట్యాల గ్రామ శివారులోని చింతల చెరువు సమీపంలో చోటు చేసుకున్నది. బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తులకు బాలుడి మృతదేహం కనిపించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన అడిగెల ప్రశాంత్ (14) స్థానిక కల్లుబట్టీలో పనిచేస్తున్నాడు. గ్రామ శివారులోని చింతల చెరువు వద్ద ప్రశాంత్ హత్యకు గురయ్యాడు. నిందితులు బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై బండరాయితో బలంగా దాడి చేసి హత్య చేసారు. హత్య విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ జానకి షర్మిల సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. అన్ని కోణల్లో దర్యాప్తు ముమ్మరం చేసారు. సంఘటన స్థలంలో నిందితుల వేలిముద్రులు, ఇతర ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఎస్పీ మృతి తల్లితో మాట్లాడి హత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. తన కొడుకు అమాయకుడని, ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలియడంలేదని రోదిస్తూ తెలిపింది. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.