New menu: నిర్మల్, డిసెంబర్ 14 (మన బలగం): విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూ విధానాన్ని తీసుకొచ్చిందని జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని రామ్నగర్ ఆశ్రమ బాలిక పాఠశాలలో ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న కొత్త మెనూ పథకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రంగాల్లో తర్ఫీదునిచ్చి విషయ పరిజ్ఞానాలని అందించేందుకు కామన్ డైట్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ అధికారులు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అంబాజీ, కౌన్సిలర్ రఘువీర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.