Water problem
Water problem

Water problem: అధికారులు.. ఉన్నా లేనట్టేనా..?

  • తాగునీటి కోసం అల్లాడుతున్న జనం
  • పట్టించుకోని పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
  • ప్రజా ప్రతినిధుల వద్దకు పరుగులు తీస్తున్న ప్రజలు
  • అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక నాయకులు కరువైన జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ

Water problem: కుభీర్, ఏప్రిల్ 8 (మన బలగం): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మండలంలో 41 గ్రామపంచాయతీలు ఉండగా ప్రతి గ్రామపంచాయతీలో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

ప్రజా ప్రతినిధుల వద్దకు పరుగులు
ఇటీవల మండల కేంద్రమైన కుభీర్‌లోని కాలనీలో వాటర్ సమస్యతో ఇబ్బందులు ఏర్పడ్డాయి సమస్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మాజీ కాలనీవాసులు ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డిని కలిసి సమస్య విన్నవించారు. ఆయన స్పందించి వెంటనే బోరు బండిని పంపించి బోరు వేయించి మోటర్ సైతం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించారు. అదేవిధంగా ఇంకో కాలనీలో వాటర్ సమస్య తో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు విన్నవించిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామపంచాయతీ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజా ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తేవడంతో స్పందించిన అధికారులు బోరు వేయించి వాటర్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఇదే సమస్య దీక్ష చేయడానికి ముందు సమస్య పరిష్కరిస్తే బాగుండేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలంలోని జాంగాం గ్రామంలో వాటర్ సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు గ్రామంలో వస్తున్నా లీకేజీల వల్ల నీళ్లు నేల పాలవుతున్నాయి. మురికి కాల్వల నుంచి పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతో లీకేజీ ఏర్పడి నీళ్లు కలుషితమై రోగాల పాలు అవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.

సంవత్సరాల తరబడి లీకేజీలు ఏర్పడ్డ రిపేరు చేయకపోవడం గమనార్ధం సంబంధిత పంచాయతీ అధికారి విధులకు సక్రమంగా హాజరు కాకుండా గ్రామ సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదో వారానికి ఒకసారి వస్తు రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తున్నారే తప్ప గ్రామ సమస్యలు పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఎంపీడీవో నవనీత్ కుమార్ కలిసి విన్నవించారు. అయినా పంచాయతీ సెక్రెటరీ లక్ష్మణ్ పనితీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలు రిపేరు చేయించండి సారు అంటే రిపేర్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేస్తారని మేమెందుకు చేస్తామని నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ సమస్యను పరిష్కరించడానికి నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత సెక్రెటరీ పై అధికారులు చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మండల అభివృద్ధి అధికారి ప్రత్యేక అధికారిగా ఉన్నా..
మండల అభివృద్ధి అధికారి ప్రత్యేక అధికారిగా ఉన్నా గ్రామాలలోని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి మండల కేంద్రమైన కుబీర్ తో పాటు మండలంలోని జాంగాం, సిర్‌పెల్లి, తదితర గ్రామాలకు మండల అభివృద్ధి అధికారి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నారు. అయితే స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ఊరికే కాలువలలో చెత్తాచెదారం పేరుకుపోయి ఇక్కడ చూసిన చెత్తకుప్పలే దర్శనమిస్తాయి మండల అభివృద్ధి అధికారి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న గ్రామ పంచాయతీల పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామపంచాయతీలలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లేనా..
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో 41 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోని కుబీర్ మండలం పెద్ద మండలంగా ఉంది. అయితే స్థానిక అధికారులు సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో మండలం సమస్యలతో సతమాతమవుతోంది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో స్థానిక అధికారులకు తమకేమీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మండల సమస్యలపై ఆరా తీస్తే అధికారులు శ్రద్ధతో సమస్యలను పరిష్కరిస్తారని పలువురు స్థానికులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులే పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి అధికారులు హిస్టరీలో వివరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మండల సమస్యలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మండిపడుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు
మండలంలో ఏ గ్రామంలో సమస్య ఏర్పడ్డ స్థానికులు ముందుగా అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. అయితే అధికారులు సమస్య వింటున్నారే తప్ప పరిష్కార మార్గం చూపకపోవడంతో అధికారుల పనితీరుపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల కొందరు ప్రజా ప్రతినిధులు ఎంపీడీవో నవనీత్ కుమార్‌ను కలిసారు. పలు సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కరించాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాయకులు అధికారి పనితీరుపై మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఈ విషయం నా దృష్టికి రాలేదు: ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్
ఎంపీడీవో నవనీత్ కుమార్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న గ్రామపంచాయతీలలో సమస్యలు ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. కుబీర్‌లో సమస్య ఏర్పడిన విషయం నా దృష్టికి వచ్చింది. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాం. కానీ జాంగాం గ్రామంలో వాటర్ సమస్య నా దృష్టికి రాలేదు. విధులపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పకుండా తీసుకుంటాం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూసి సహించేది లేదు.

Water problem
Water problem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *