Survey of Indiramma houses
Survey of Indiramma houses

Survey of Indiramma houses: పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Survey of Indiramma houses: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా కొనసాగుతున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు మండలంలోని పోతుగల్‌లో అధికారులు సర్వే చేస్తుండగా, శనివారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆయా గ్రామాల్లో దరఖాస్తుదారుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజా పాలన కింద జిల్లాలోని ఆయా గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అర్జీదారుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సంబంధిత గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారని వివరించారు. క్షేత్ర స్థాయిలో అన్ని వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. సర్వేకు వచ్చే అధికారులకు దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు.
విద్యాలయాల తనిఖీ
తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలోని ఎంపీపీఎస్, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, పాఠాలు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
సిరిసిల్ల బల్దియాలో పరిశీలన
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయా విభాగాల్లో పరిశీలించి, మున్సిపల్ మేనేజర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్‌ను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ డీఈ భాస్కర్, డీఎల్ పీవో నరేశ్, ఎంపీఓ బీరయ్య ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *